Home  »  News  »  Monalisa: పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా.. లవ్ జిహాద్ అంటున్న దర్శకుడు

Updated : Mar 12, 2026

 

కుంభమేళాతో ఫుల్ ఫేమస్
వివాహ బంధంతో బ్యాచులర్ లైఫ్ కి ఎండ్ కార్డ్
లవ్ జిహాద్ ఆరోపణలు ఎందుకు 
కేరళలో ఎందుకు పెళ్లి చేసుకుంది. 

 

ఇండియా వైడ్ గా ఓవర్ నైట్  స్టార్ స్టేటస్ పొందాలంటే పెట్టి పుట్టాలనే సామెతని కొంత మంది మాత్రమే ఓన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళల్లో మోనాలిసా(Monalisa)ఒకటి. బహుశా కుంభమేళ మోనాలిసా అనాలేమో. దీంతో ఆమె ప్రయాగరాజ్ లో జరిగిన కుంభమేళాలో  ఏం చేసిందో, ఎలా ఫేమస్ అయ్యిందో  ఇండియా మొత్తం చెప్పేస్తుంది. అసలు గత సంవత్సరం జరిగిన కుంభమేళా వేడుకలు మోనాలిసా కోసమే వచ్చాయేమో. రీసెంట్ గా మోనాలిసా మరోసారి ఇండియన్ స్ట్రీట్స్, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది డే గా కూర్చొని ఉంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
 
మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ ని నిన్న వివాహం చేసుకుంది. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరగగా ముందుగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత గుడిలో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ తతంగం మొత్తం పోలీసుల రక్షణలో జరిగినట్లుగా తెలుస్తుంది. మోనాలిసా కుటుంబ సభ్యులు మాత్రం వివాహానికి హాజరు కాలేదు. మతాంతర వివాహం కావడమే అందుకు కారణమని తెలుస్తుంది.

also read: MGR: రాజేంద్రప్రసాద్‌కి చుక్కలు చూపిస్తున్న తమిళులు.. కరెక్టేనా అలా చేయడం    

 ఫర్మాన్ ఖాన్‌(Farman Khan)మోనాలిసాకి ఏడాదిన్నర క్రితం ఫేస్ బుక్ లో పరిచయం జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధంతో ఒకటయ్యారు. మోనాలిసా సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి గత ఏడాది లైఫ్ అనే తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక హిందీ మూవీ కూడా ఆమె ఖాతాలో ఉంది. ఆ సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రా. మోనాలిసా వివాహంపై ఆయన మాట్లాడుతు మోనాలిసా జీవితాన్ని మార్చాలని నటనలో నేనే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చాను. కానీ నా దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి ఆమెని తప్పుదోవ పట్టించాడు. సౌత్ ఇండస్ట్రీలో ఆమెకి సినిమా అవకాశాలు కూడా అతడే కల్పించాడు.  మోనాలిసా ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకి లోనై చేసుకుంది. ఇది సాధారణ ప్రేమ వివాహం కాదు. లవ్ జిహాద్ లో భాగమని సనోజ్ మిశ్రా చెప్పుకొచ్చాడు. ప్రెజెంట్  మోనాలిసా పెళ్లికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.    

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.