Home  »  News  »  Aaya Sher: 'ఆయా షేర్' హుక్ స్టెప్ కాపీ అంటూ ట్రోల్స్.. యువరాజ్ సింగ్ ఎంత పని చేశాడు!

Updated : Feb 26, 2026

  • 'ఆయా షేర్' హుక్ స్టెప్ పై ట్రోల్స్
  • కాపీనా? క్రియేటివిటీనా?
  • అసలు యువరాజ్ సింగ్ ఎవరు?
  • బాబా జాక్సన్ గా ఎందుకు మారాడు?

ఏదైనా సాంగ్ విడుదలైనప్పుడు కాపీ ఆరోపణలు రావడం సహజం. ఎక్కువగా ట్యూన్ కాపీ కొట్టారనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే, డ్యాన్స్ స్టెప్ కాపీ అనే ఆరోపణలు అరుదుగా వస్తాయి. ఇప్పుడు 'ఆయా షేర్' సాంగ్.. అలాంటి ఆరోపణలనే ఎదుర్కొంటోంది.

'దసరా' తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'(The Paradise). అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా 'ఆయా షేర్' అనే సాంగ్ విడుదలైంది. సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రసుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇందులో నాని సిగరెట్ వెలిగిస్తూ వేసిన హుక్ స్టెప్ కూడా వైరల్ గా మారింది. అదే సమయంలో ఈ స్టెప్ పై కాపీ అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. (Aaya Sher Song)

2021 లో తాను వేసిన స్టెప్ ని కాపీ చేసి 'ఆయా షేర్'లో పెట్టారని బాబా జాక్సన్ అనే డ్యాన్సర్ ఆరోపిస్తున్నాడు. రాజస్థాన్ కి చెందిన బాబా జాక్సన్ అసలు పేరు యువరాజ్ సింగ్. మైకేల్ జాక్సన్ కి వీరాభిమైన అయిన యువరాజ్.. తన పేరుని బాబా జాక్సన్ గా మార్చుకున్నాడు. (Baba Jackson)

సోషల్ మీడియాలో తనదైన డ్యాన్స్ స్టెప్పులతో మంచి పేరు సంపాదించుకున్నాడు బాబా జాక్సన్. పలువురు బాలీవుడ్ స్టార్స్ సైతం అతని డ్యాన్స్ కి ఫిదా అయ్యారు. అలాంటి బాబా జాక్సన్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ నానిని టార్గెట్ చేశాడు. తాను గతంలో వేసిన స్టెప్ ని కాపీ కొట్టారంటూ 'ది ప్యారడైజ్' టీమ్ పై ఆరోపణలు చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు సౌత్ లోనూ అతని పేరు మారుమోగిపోతోంది. 

'ఆయా షేర్' హుక్ స్టెప్.. నిజంగానే బాబా జాక్సన్ స్టెప్ ని కాపీ కొట్టినట్టుగా ఉందని కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. డ్యాన్స్ స్టెప్పులు ఒక దానిని పోలి మరొకటి ఉండటం సహజమని, అంతమాత్రాన కాపీ అంటూ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

కాగా, ఈ 'ఆయా షేర్' సాంగ్ కి సుధన్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ కాపీ ఆరోపణలపై ఆయన ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి.

Also Read: థియేటర్లలో విష్ణు, మహేష్ ల విన్యాసం.. ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.