![]() |
![]() |

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. టీవీ, రేడియో రంగాలతో పాటు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా రాణించిన నల్లూరి సుధీర్ కుమార్ (Nalluri Sudheer Kumar) కన్నుమూశారు. గురువారం ఉదయం హైదరాబాద్ లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
మచిలీపట్నంకు చెందిన సుధీర్ కుమార్.. సంగీతంపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. దూరదర్శన్ తొలినాళ్ళలో సుధీర్ కుమార్ ఎన్నో పాటలను స్వరపరిచారు. 1986-2000 మధ్య కాలంలో దూరదర్శన్ సీరియల్స్‌కు అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత దర్శకులలో ఒకరిగా నిలిచారు. టీవీ సీరియల్స్ కు సంగీతం అందించి, ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. పలు సినిమాలకూ సంగీత దర్శకుడిగా పనిచేశారు. 'అగ్ని ప్రవేశం', 'కూతురు', 'అమ్మో అల్లుడా' వంటి చిత్రాలకు సంగీతం అందించారు.
సుధీర్ కుమార్ మృతి పట్ల టీవీ, సినీ రంగాలకు చెందిన పలువురు సంతాపం తెలుపుతున్నారు.
Also Read: సినిమాలకు బ్రేక్ ఇస్తున్న రామ్ చరణ్!
![]() |
![]() |