![]() |
![]() |

ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. మార్చిలో విడుదల కావాల్సిన 'పెద్ది', 'ది ప్యారడైజ్' వాయిదా పడినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. తాజాగా ఈ లిస్టులో మరో సినిమా చేరినట్లు తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లు టాక్. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ లో లేదా దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (Aadarsha Kutumbam House No 47)
వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్స్ కి త్రివిక్రమ్ రైటర్ గా పని చేశారు. అందుకే వెంకీ, త్రివిక్రమ్ కాంబో అనగానే.. ప్రకటనతోనే 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

నిజానికి 'ఆదర్శ కుటుంబం' కన్నా ముందు కుమారస్వామి కథతో 'గాడ్ ఆఫ్ వార్' అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేశారు త్రివిక్రమ్. ఆ భారీ మూవీ ఆలస్యమవ్వడంతో.. వెంకటేష్ తో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను పట్టాలెక్కించారు.
'గాడ్ ఆఫ్ వార్' మొదట అల్లు అర్జున్ తో, తర్వాత ఎన్టీఆర్ తో చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. 'ఆదర్శ కుటుంబం' తర్వాత ఆ మైథలాజికల్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
Also Read: ఈ సీక్వెల్ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకవుతారు!
![]() |
![]() |