![]() |
![]() |

-సుధీర్ బాబు హిట్ అందుకున్నాడా!
-తొలి రోజు కలెక్షన్స్ ఇవే
-సోనాక్షి సిన్హా అదనపు ఆకర్షణ
హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమా సినిమాకి వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో అభిమానులని, ప్రేక్షకులని అలరించే హీరో సుదీర్ బాబు(Sudheer Babu). నిన్న మరో వైవిధ్యమైన మూవీ 'జటాధర'(Jatadhara)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ, మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కడంతో పాటు బాలీవుడ్ అగ్ర నటి సోనాక్షి సిన్హా 'ధన పిశాచి' అనే కీలక పాత్రలో కనిపించడం ఈ చిత్రం స్పెషాలిటీ. నార్త్ లో కూడా భారీ థియేటర్స్ లోనే విడుదలైంది.
ఇక ఈ చిత్రం మొదటి రోజు తెలుగు, హిందీ కలిపి 90 లక్షల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.ఈ మేరకు అన్నిమీడియా సంస్థలోను ఇదే న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఒక రకంగా సుదీర్ బాబు ప్రీవియస్ మూవీతో పోల్చుకుంటే జటాధర 90 లక్షల మేర రాబట్టడం పర్లేదని చెప్పవచ్చు. టాక్ పరంగా చూసుకుంటే జటాధర ద్వారా సిల్వర్ స్క్రీన్ పై ఒక కొత్త ప్రపంచం ప్రత్యక్షమైందనే అభిప్రాయాన్ని మూవీ లవర్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు ముందు ఎంత మేర కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.
Also Read: ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ డే కలెక్షన్స్
మనుషులు చనిపోయినా కూడా ఆత్మల రూపంలో తిరుగుతుంటారనే వాదనని నమ్మని ఘోస్ట్ హంటర్ శివ గా సుదీర్ బాబు కనిపించాడు. కానీ శివకి నిజంగానే ఆత్మలు కనిపిస్తాయి. ధన పిశాచి సోనాక్షి సిన్హా తో పోరాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగే కథనాలు ఆసక్తిగానే ఉంటాయి. శిల్పా శిరోద్కర్, శ్రీనివాస్ అవసరాల, ప్రదీప్ రావత్ కథకి ముఖ్యమైన కీలక పాత్రల్లో కనిపించగా వెంకట్ కళ్యాణ్(venkat Kalyan)దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించింది.
![]() |
![]() |