![]() |
![]() |
- అతన్ని ఊరికే వదిలిపెట్టను
- నా వాయిస్‌తో మాట్లాడుతున్నాడు
- నా పేరుతో మోసాలు జరుగుతున్నాయి
సౌత్‌లోని వివిధ భాషల్లో హీరోయిన్‌గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న రుక్మిణీ వసంత్.. తాజాగా ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తన పేరును వాడుకుండా మోసాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ.. అతన్ని ఊరికే వదిలిపెట్టనని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అతనికి వార్నింగ్ ఇచ్చింది. అతనెవరు, ఎందుకా పోస్ట్ పెట్టిందనేది అర్థం కాక నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను, అభిమానులను ఒక పోస్ట్ ద్వారా హెచ్చరించింది రుక్మిణి. ‘నా వాయిస్‌తోనే మాట్లాడుతూ ఒక వ్యక్తి కొందరికి కాల్ చేసి మాట్లాడినట్టు నాకు తెలిసింది. అలాంటి కాల్స్ వస్తే ఎవరూ స్పందించవద్దు. వేరొకరి గొంతుతో మాట్లాడుతూ మోసాలకు పాల్పడడం సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై యాక్షన్ తీసుకుంటాను. ఇలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే.. నేరుగా నన్ను లేదా నా టీమ్‌ని సంప్రదించవచ్చు. ఈ తరహా మోసాలకు చాలా మంది పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో మీరంతా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ హెచ్చరించింది రుక్మిణీ వసంత్.
![]() |
![]() |