![]() |
![]() |

ప్రముఖ కథ, నవలా రచయిత లల్లాదేవి కన్నుమూశారు. ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు. లల్లాదేవి పేరుతో రచనలు చేశారు. పదుల సంఖ్యలో కథలు, నవలలు, నాటకాలు రచించి గొప్ప రచయితల్లో ఒకరిగా పేరుపొందారు. 82 సంవత్సరాల వయసులో నేడు(అక్టోబర్ 3న) ఆయన మరణించారు.
లల్లాదేవి 30కి పైగా కథలు, 50కి పైగా నవలలు రచించారు. ఆయన నవలలు సినిమాలుగానూ వచ్చాయి. అప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య 100వ సినిమా 'శ్వేతనాగు'కి ఆయనే రచయిత కావడం విశేషం. 2004లో విడుదలైన ఈ సినిమాకి సంజీవి దర్శకత్వం వహించగా, సి.వి. రెడ్డి నిర్మించారు.
లల్లాదేవి నవలలు చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:
![]() |
![]() |