![]() |
![]() |

పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)తన రేంజ్ ని మరింతగా చాటి చెప్పాలని 'అట్లీ(Atlee)డైరెక్షన్ లో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 'AA 22 ' అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకణ దశలో ఉంది. పునర్జన్మల కాన్సెప్ట్ తో ముడిపడిన సైన్స్ ఫిక్షన్ సబ్జెట్ గా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. ఈ మాటలకి బలాన్ని చేకూర్చేలా, మూవీ ప్రకటన రోజు రిలీజ్ చేసిన వీడియోతో పాటు, దీపికా పదుకునే(Deepika Padukune)క్యారక్టర్ కి సంబంధించి మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోస్ ఉన్నాయి.
ఇక ఈ చిత్రం సాంకేతికంగా, టెక్నీకల్ గా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండనుండటంతో, ప్రముఖ హాలీవుడ్ నిపుణులు AA 22 కి పని చేస్తున్నారు. వాళ్లల్లో జపనీస్ కొరియోగ్రాఫర్ 'హాక్' ఒకరు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్, అట్లీతో దిగిన ఫొటోల్ని షేర్ చేసిన 'హాక్' మూవీపై స్పందిస్తు 'భారతీయ సినిమాకి వర్క్ చెయ్యాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. aa22 కోసం నెలరోజుల పాటు ఎంతగానో కష్టపడ్డాను. భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు మించి ఈ చిత్రం గురించి ఇంకేం చెప్పలేను అని చెప్పుకొచ్చాడు.

అమెరికన్ హిప్ హాప్ డ్యాన్స్ క్రూ, క్వెస్ట్ క్రూ సభ్యుడైన హాక్ పూర్తి పేరు 'హోకుటో కొనిషి'(Hokuto Konishi).జపాన్(Japan)లోని టోక్యో జన్మ స్థలం. బ్రేక్ డాన్స్ కి పెట్టింది పేరు. ముఖ్యంగా హుక్ స్టెప్స్ లో బాగా ఫేమస్. హనీ 2 ,ఆల్ స్టైల్స్ వంటి చిత్రాలు హాక్ కోరియోగ్రఫీ లో వచ్చాయి. మరి అల్లు అర్జున్ డాన్స్ లో ఎంతలా వీర విహారం చేస్తాడో తెలిసిందే. పైగా అల్లు అర్జున్ చేసిన కొన్ని హుక్ స్టెప్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ''హాక్' కొరియోగ్రాఫర్ లో అల్లు అర్జున్ డాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉంది. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకునే తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకి చోటు ఉన్న విషయం తెలిసిందే.అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కాగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇటీవల రిలీజైన పవన్ కళ్యాణ్ ఓజి లో జపాన్ నేపధ్యం ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
![]() |
![]() |