![]() |
![]() |

లవ్ టుడే తో తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన హీరో,దర్శకుడు 'ప్రదీప్ రంగనాధన్'(Pradeep Ranganathan). గత ఫిబ్రవరిలో 'డ్రాగన్ ది రిటర్న్' తో వచ్చి రెండు భాషల్లోను మంచి విజయాన్ని అందుకున్నాడు. చెన్నై కి చెందిన ప్రదీప్ రీసెంట్ గా హైదరాబాద్ లో 'ఓజి' ని వీక్షించడం జరిగింది.
ప్రదీప్ రంగనాధన్ ఈ విషయాన్ని 'ఎక్స్'(X)వేదికగా తెలుపుతు 'నేను ఇప్పుడు హైదరాబాద్(Hyderabad)రావడానికి ఒకే ఒక కారణం. పవర్ స్టార్ 'ఓజి'(Og)చూడటానికి మాత్రమే. ఈ మాస్ ఎక్స్ పీరియెన్స్ ని తెలుగు వాళ్ళతో చూడటమే కదా అసలు మాస్' అని ట్వీట్ చెయ్యడంతో పాటు థియేటర్ లో మూవీ చూస్తున్న పిక్ ని కూడా షేర్ చేసాడు.
ప్రదీప్ రంగనాధన్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' తో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 15 న విడుదల కాబోతుండగా, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా చేసింది .నయనతార హస్బెండ్ విగ్నేష్ శివన్ దర్శకుడు. ఇక అక్టోబర్ 17 నే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'డ్యూడ్' తో కూడా థియేటర్స్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ కాగా కీర్తిశ్వరన్ దర్శకత్వం.
![]() |
![]() |