![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనారోగ్యం పాలయ్యారు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన.. గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకొంటున్నారు. అయినా జ్వరం తీవ్రత తగ్గలేదు. దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న పవన్ కళ్యాణ్.. వైద్యుల సూచనల మేరకు ఈరోజు హైదరాబాద్ వెళ్ళి, వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. (They Call Him OG)
Also Read: ఓజీ మూవీ రివ్యూ
పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం తాజాగా విడుదలై, బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం అభిమానులంతా ఓజీ ఫీవర్ లోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో పవన్ అనారోగ్యం పాలయ్యారనే వార్త అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. పైగా కొంతకాలంగా ఆయన తరచూ అనారోగ్యానికి గురైనట్లు వార్తలొస్తున్నాయి. దాంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఎటువంటి ఆందోళన అక్కర్లేదని, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్లే ఆయనకు జ్వరం వచ్చిందని అంటున్నారు. పైగా, ఇటీవల వర్షంలో జరిగిన 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ హాజరైన సంగతి తెలిసిందే. అదే ఆయనకు జ్వరం రావడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.
![]() |
![]() |