![]() |
![]() |
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి ఒక సాలిడ్ హిట్ పడి చాలా కాలమైంది. ఆకలితో ఉన్న పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ లాంటి సినిమాగా వచ్చింది ‘ఓజీ’. ఒకరోజు ముందు నుంచే మొదలైన ఫ్యాన్స్ సందడి షో పూర్తయిన తర్వాత తారా స్థాయికి చేరుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓజీ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. పవన్‌ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి కంటెంట్‌తో, అలాంటి ఎలివేషన్స్‌తో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ సుజీత్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ‘సుజీత్ సినిమాటిక్ యూనివర్స్’పై సుజీత్ ఇచ్చిన క్లారిటీ పవర్‌స్టార్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
‘ఎన్నో సంవత్సరాల ఈ ప్రయాణం చివరకు ముగిసింది. నాకు, నా ఫ్యామిలీకి ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా డైరెక్షన్ టీమ్‌కి, నా టెక్నీషియన్స్‌కి ఐలవ్‌యు చెప్తున్నాను. నా ఆనందాన్ని ఇంతకంటే బాగా చెప్పలేను. నాకు మొదటి నుంచీ మంచి సపోర్ట్ ఇచ్చిన నిర్మాతలు దానయ్యగారికి, కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. నాకు మంచి సపోర్ట్‌గా ఉండి తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చిన థమన్ అన్నకు థాంక్స్. నవీన్ నూలి, రవి కె.చంద్రన్ సర్, మనోజ్ పరమహంస సర్.. మీ పార్టిసిపేషన్ ఎక్స్‌ట్రార్డినరీ. మీ అందరి కృషితో సినిమా ఒక రేంజ్‌కి వెళ్లిపోయింది. ఈరోజు మీరు చూపిస్తున్న ప్రేమ, మ్యాడ్ నెస్ నేను ఊహించలేనిది. సినిమా చూడండి, సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. గుర్తుపెట్టుకోండి.. ఇది ఆరంభం మాత్రమే. అన్నీ సరిగ్గా కుదిరితే ఓజీ ప్రపంచం ఇక్కడి నుండి మరింత పెద్దదిగా మారుతుంది. లవ్ యు మై పవర్ స్టార్’
ఈ పోస్ట్‌తో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్‌కి ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ పోస్ట్‌ను హైలైల్ చేస్తూ పెట్టడంతో ‘సుజీత్ సినిమాటిక్ యూనివర్స్’ ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చింది. ఏది ఏమైనా టాలీవుడ్‌లో ఒక కొత్త ప్రపంచానికి శ్రీకారం చుట్టారు పవన్‌కళ్యాణ్, సుజీత్. దీంతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగిందని చెప్పాలి.
![]() |
![]() |