![]() |
![]() |
.webp)
ఈ మధ్య కాలంలో మరే తెలుగు సినిమాపై లేనంతగా పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్.. సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటిదాకా 'ఓజీ' నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. 'ఓజీ'పై నెలకొన్న అంచనాలకు తగ్గట్టుగానే.. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ మూవీ హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం. (They Call Him OG)
నైజాంలో రూ.55 కోట్లు, ఆంధ్రాలో రూ.80 కోట్లు, సీడెడ్ లో రూ.22 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.157 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ.30 కోట్లకు పైగా బిజినెస్ చేసిందట. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. రూ.190 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. గ్రాస్ పరంగా చూస్తే.. కనీసం రూ.350 కోట్లు రాబట్టాలి. (OG Business)
ప్రస్తుతం 'ఓజీ'పై నెలకొన్న అంచనాలకు బట్టి చూస్తే.. మొదటి రోజే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. రూ.350 కోట్లు అనేది పెద్ద టార్గెట్ కాదని, రూ.500 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందనే అభిప్రాయాలున్నాయి. చూద్దాం మరి, బాక్సాఫీస్ దగ్గర ఓజీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో.
![]() |
![]() |