![]() |
![]() |

ఇటీవల ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్లలో కొందరు జర్నలిస్ట్ లు అడుగుతున్న ప్రశ్నలతో సినీ సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ కొందరి తీరు మారడంలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ జర్నలిస్ట్ పై ప్రముఖ నటి మంచు లక్ష్మి ఫిల్మ్ ఛాంబర్‌కి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. (Manchu Lakshmi)
రీసెంట్ గా మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమెకు వయసు, వేసుకునే బట్టల మీద ప్రశ్న ఎదురైంది. దీంతో అప్పుడే ఆమె ధీటైన సమాధానం ఇచ్చారు. మరోవైపు ఈ ప్రశ్నకు సంబంధించి క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంలో ఎక్కువమంది మంచు లక్ష్మికి మద్దతుగా నిలుస్తున్నారు.
అయితే ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ప్రశ్నను సీరియస్ గా తీసుకున్న మంచు లక్ష్మి.. ఆ జర్నలిస్ట్ పై ఫిల్మ్ ఛాంబర్‌కి కంప్లైంట్ చేశారు. తన వయసు, వేసుకునే బట్టల గురించి ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్న.. తన గౌరవడానికి భంగం కలిగించేలా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అది ఇంటర్వ్యూలా లేదు, ఎటాక్ లా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌ల మీద నాకు గౌరవం ఉంది.. కానీ, ఇది జర్నలిజం కాదు, వైరల్ అవ్వడం కోసం చేసినట్లు ఉందని అభిప్రాయపడ్డారు. మేల్ డామినేట్ ఇండస్ట్రీలో ఉన్నాను.. ఎంతో కష్టపడి నిలదొక్కుకున్నాను. సైలెంట్‌గా ఉంటే ఇదే బిహేవియర్ కంటిన్యూ అవుతుంది.. అందుకే కంప్లైంట్ చేస్తున్నాను అని అన్నారు. ఆ జర్నలిస్ట్ పై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఫిల్మ్ ఛాంబర్‌ను మంచి లక్ష్మి కోరారు.

![]() |
![]() |