![]() |
![]() |

సరిగ్గా వారం రోజుల్లో 'ఓజీ' తుఫాన్ రాబోతుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ సెప్టెంబర్ 25న థియేటర్లో అడుగుపెట్టనుంది. ఇంతవరకు ట్రైలర్ విడుదల కాలేదు, భారీ ప్రమోషన్స్ కూడా లేవు. అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. అక్కడ సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగునాట బుకింగ్స్ ఓపెన్ అయితే.. ఇక్కడ కూడా సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలకు రెట్టింపు చేసేలా సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. (They Call Him OG)
తాజాగా 'ఓజీ' సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఓజీ మూవీ చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ ని సుజీత్ చూపించిన తీరు అదిరిపోయిందట. పవన్ లుక్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అంటున్నారు. ఇంట్రడక్షన్ సీన్ తోనే ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేయబోతున్నాడట సుజీత్. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయట. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్ అయితే వేరే లెవెల్ అని చెబుతున్నారు. యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుందని టాక్. ఇక ఈ సినిమాలో రెండు బిగ్ సర్ ప్రైజ్ లు ఉన్నాయట. అవి థియేటర్లలో ప్రేక్షకులకు థ్రిల్ పంచడం ఖాయమనే మాట వినిపిస్తోంది.
ఇప్పటికే 'ఓజీ'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనే ఆసక్తి నెలకొంది.
![]() |
![]() |