![]() |
![]() |

90 's వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు 'ఆదిత్య హాసన్'(Aditya Haasan).ప్రముఖ ఓటిటి మాధ్యమం 'ఈటీవీ విన్'(Etv Win)ద్వారా స్ట్రీమింగ్ అయ్యి అశేష ప్రేక్షకాదరణ పొందింది. థియేటర్స్ లో విడుదల చెయ్యాల్సిందనే మాటలు కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి వినిపించాయి. దీన్ని బట్టి 90 's వెబ్ సిరీస్ సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆదిత్య హాసన్ రీసెంట్ గా నిర్మాతగా మారి సాయి మార్తాండ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తు 'లిటిల్ ఆర్ట్స్'(Little Hearts)అనే కామెడీ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
ఈ చిత్రం ఘన విషయం సాధించడంతో పాటు రికార్డు స్థాయి కలెక్షన్స్ ని సృష్టిస్తుంది. దీంతో ఆదిత్య హాసన్ టీం నెక్స్ట్ చేస్తున్న 'ఆనంద్ దేవరకొండ', వైష్ణవి చైతన్య ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రానికి 'ఆదిత్య హాసన్ నే దర్శకుడు కావడంతో, ఈసారి ఎలాంటి సబ్జెట్ తో తెరకెక్కబోతుందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. రీసెంట్ గా ఈ మూవీకి 'ఓటిటి' డీల్ పూర్తయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక ప్రముఖ సంస్థ ఏకంగా 11 కోట్ల రూపాయలు చెల్లించి తమ సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
మధ్య తరగతికి చెందిన వ్యక్తుల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, ప్రేమలకి, యూత్ కామెడీ టచ్ ని ఇస్తూ ఆదిత్య హాసన్ కథలు, డైలాగులు ఉంటాయి. ఈ కోవలోనే 90 's వెబ్ సిరీస్, లిటిల్ హార్ట్స్ రూపొంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. దీంతో 'బేబీ' జంట వైష్ణవి, ఆనంద్ దేవరకొండ తో తెరకెక్కే సబ్జెట్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

![]() |
![]() |