![]() |
![]() |

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో థియేటర్లలో నవ్వులు పూయించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కళ్యాణ్ శంకర్. ఈ రెండు సినిమాలు సితార ఎంటర్టైన్మెంట్స్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. కళ్యాణ్ తన తదుపరి సినిమాని కూడా సితార బ్యానర్ లోనే చేయనున్నాడు. కళ్యాణ్ నెక్స్ట్ మూవీ మాస్ రాజా రవితేజతో ఉంటుందని గతంలో బలంగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు రవితేజ ప్రాజెక్ట్ కాకుండా, మరో ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. (Kalyan Shankar)
కొత్త వాళ్ళతో ఓ హారర్ కామెడీ ఫిల్మ్ చేసే ప్లాన్ లో కళ్యాణ్ శంకర్ ఉన్నాడట. బాయ్స్ హాస్టల్ లోకి దెయ్యమొస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ కథ నడుస్తుందట. కళ్యాణ్ తనదైన రైటింగ్ తో ఎంతగా నవ్వించగలడో మ్యాడ్ సినిమాలలో చూశాం. ఇక ఇప్పుడు హారర్ కామెడీ ఫిల్మ్, అందునా బాయ్స్ హాస్టల్ లోకి దెయ్యం రావడమనే కాన్సెప్ట్ అంటే ఇంకా ఏ రేంజ్ లో ఊహించుకోవచ్చు.
కళ్యాణ్ శంకర్, సితార కాంబినేషన్ లో రూపొందనున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది.
![]() |
![]() |