![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ఈ నెల 25 న గ్యాంగ్ స్టార్ డ్రామా 'ఓజి'(Og)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. రిలీజ్ డేట్ కి రెండు వారాలే ఉండటంతో పాటు, ప్రచార చిత్రాలు జోరందుకోవడంతో ఫ్యాన్స్ లో పండుగ వాతావరణం వచ్చినట్లయింది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ 'ప్రకాష్ రాజ్' ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటి వరకు, ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలు గురించి చెప్పుకొచ్చారు కానీ,ప్రకాష్ రాజ్ క్యారక్టర్ ఎలా ఉండబోతుందో వెల్లడి చెయ్యలేదు.
ప్రకాష్ రాజ్ (Prakash Raj)నటనకి ఉన్న శక్తీ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. హీరోలని బీట్ చేసే విధంగా తన నటన కొనసాగుతుంది. ఇందుకు బడా క్యారక్టర్ ని పోషించాల్సిన అవసరం లేదు. చిన్న క్యారక్టర్ అయినా సరే, ప్రకాష్ రాజ్ తన నటనతో ఎదుటివారిని బీట్ చేస్తాడు. ఇందుకు ఎన్నో సినిమాల్లోని క్యారెక్టర్స్ ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పవన్, ప్రకాష్ రాజ్ ఇటీవల సనాతన ధర్మం విషయంలో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. ఈ విషయంలో పవన్ కొన్ని సార్లు సైలెంట్ గా ఉన్నా, ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ పై విమర్శలని ఆపలేదు. పైగా పవన్ ఉప ముఖ్యమంతి హోదాలో రాజకీయంగా తీసుకున్న పలు నిర్ణయాలని కూడా ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తు వస్తున్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతు వస్తున్నారు.
ఈ క్రమంలో ఓజి లో పవన్ ,ప్రకాష్ రాజ్ మధ్య పోటా పోటీగా డైలాగులు ఉంటే, పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. గతంలో ఇద్దరి మధ్య విమర్శలు నెలకొని ఉన్నప్పుడే 'వకీల్ సాబ్' తో వచ్చి, తమ నటనతో మెస్మరైజ్ చేసారు. పైగా పవన్ తో పాటు ప్రకాష్ రాజ్ చాలా సందర్భాల్లో మాట్లాడుతు' పొలిటికల్ గా మావి వేరు వేరు దారులైనా,సినిమాల పరంగా ఒక్కటే అని చెప్తు వస్తున్నారు. మరి పవన్ వీరాభిమానులు కూడా అలాగే భావిస్తారేమో చూడాలి. ఏది ఏమైనా ఓజి లో పవన్, ప్రకాష్ రాజ్ ఈ సారి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ప్రత్యేకతని సంతరించుకుంది.
![]() |
![]() |