![]() |
![]() |

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా గతంలో 'పీఎం నరేంద్ర మోడీ' అనే సినిమా వచ్చింది. వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించిన ఈ బయోపిక్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఇప్పుడు మోడీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈసారి భారీ బడ్జెట్ తో, భారీ టెక్నికల్ టీమ్ తో ఇది రూపొందనుందని సమాచారం. (Unni Mukundan as Narendra Modi)
నరేంద్ర మోడీ పాత్రలో మలయాళ యాక్టర్ ఉన్ని ముకుందన్ నటించనున్నాడట. ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ, యశోద వంటి తెలుగు సినిమాల్లో నటించాడు. అలాగే గతేడాది ఆయన నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' పాన్ ఇండియా వైడ్ గా విడుదలై రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న ఉన్ని ముకుందన్.. మోడీ బయోపిక్ లో నటించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. మరి మోడీ పాత్రలో ఉన్ని ముకుందన్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
![]() |
![]() |