![]() |
![]() |
.webp)
ఈ నెల 12 న సెల్యులాయిడ్ పై ఒక కొత్త ప్రపంచం 'మిరాయ్'(Mirai)రూపంలో ఆవిష్కృతమైన విషయం తెలిసిందే. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులని మెప్పిస్తూ, మూడు రోజులకి 81 .2 కోట్ల గ్రాస్ ని అందుకుంది. మేకర్స్ ఈ విషయాన్నీ అధికారంగా ప్రకటించారు. నిన్న జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ ప్రభావం కూడా 'మిరాయ్' కలెక్షన్ పై పడలేదంటే ఈ చిత్రం సాధించిన ఘన విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు.
ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ థియేటర్స్ లో విడుదలైంది. తేజ సజ్జ(Teja Sajja)గత చిత్రం 'హనుమాన్'(Hanuman)హిందీలో భారీ కలెక్షన్స్ రాబట్టడంతో మిరాయ్ హిందీ వసూళ్ల పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం, మిరాయ్ తొలి రోజు 1.75 కోట్ల రూపాయలు వసులు చేసింది. తక్కువగానే కలెక్షన్స్ రావడంతో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అగ్ర దర్శకుడు 'కరణ్ జోహార్' మిరాయ్ ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అనే ఆఫర్ ని రెండో రోజు నుంచే ప్రకటించాడు. దీంతో శనివారం 3.10 కోట్లు, ఆదివారం 3.81 కోట్లుతో టోటల్ గా మూడు రోజులకి 8.66 కోట్ల రూపాయల నెట్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.ఇలా ఆఫర్ ప్రకటించాక 'మిరాయ్' రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకోవడం గమనార్హం
శ్రీరాముడు ఆయుధమైన మిరాయ్ కి, సామ్రాట్ అశోకుడి శక్తులకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే పాయింట్ తో మిరాయ్ తెరకెక్కింది. దుష్టశక్తీ నుంచి దైవానుగ్రహంతో విశ్వాన్ని కాపాడే వేద అనే క్యారక్టర్ లో తేజ సజ్జ, దైవశక్తీ తో విశ్వాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలనే 'మహావీర్ లామా' క్యారక్టర్ లలో మంచు మనోజ్(Manchu Manoj)పోటాపోటీగా నటించారు. శ్రీయ, రితికా నాయక్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై విశ్వప్రసాద్(Tg Vishwaprasad)సుమారు 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni)దర్శకుడు.

![]() |
![]() |