![]() |
![]() |

తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'మిరాయ్' (Mirai). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ యాక్షన్ అడ్వెంచర్.. భారీ అంచనాలతో సెప్టెంబర్ 12న థియేటర్లలో అడుగుపెట్టింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే, పాజిటివ్ టాక్ కూడా తోడు కావడంతో.. బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. రెండు రోజుల్లోనే రూ.55 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటింది.
'మిరాయ్' వసూళ్ల వివరాలను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు అంతకుమించిన జోరు చూపిస్తూ రూ.28.40 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే ఏకంగా రూ.55.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడో రోజు ఆదివారం కావడంతో మరో రూ.30 కోట్ల గ్రాస్ దాకా వసూలు చేసే అవకాశముంది. దాంతో మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.85 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది.
సెప్టెంబర్ 25న విడుదలవుతున్న 'ఓజీ' వరకు బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల తాకిడి లేదు. దాంతో మరో పది రోజులు 'మిరాయ్' జోరు ఇలాగే కొనసాగనుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈ మూవీ రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |