![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ఈ నెల 25 న 'ఓజి'(Og)తో వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నఈ చిత్రంలో పవన్ 'ఓజాస్ గంభీర్' అనే క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచుతున్నారు. ఈ మేరకు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న పవన్ పిక్స్ తో పాటు,ప్రచార చిత్రాలు 'ఓజి'పై అంచనాలని పెంచుతున్నాయి. పవన్ సరసన ప్రియాంక మోహన్(priyanka MOhan)జత కట్టింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)ఫస్ట్ టైం విలన్ గా చేస్తుండగా, సలార్ ఫేమ్ శ్రీయారెడ్డి తో పాటు మరికొంత మంది నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఓజి కి సంబంధించి రిలీజ్ చేసిన పవన్ పిక్స్ లో 'ముంబై లోని తాజ్ మహల్' హోటల్ బ్యాక్ గ్రౌండ్ లో ఓల్డ్ కారుపై పవన్ స్టైల్ గా కూర్చున్న పిక్ కూడా ఉంది. ఆ పిక్ కి సంబంధించి కారు నెంబర్ bmy 0893 గా ఉంది. సోషల్ మీడియా వేదికగా ఈ నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ని అభిమానులు బయటపెట్టారు. 0893 అంటే అగస్ట్ నెల తొంబై మూడవ సంవత్సరం అని అర్ధం. ఆ డేట్ రోజునే పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ సినిమా అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయికి సంతకం చేసాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దర్శకుడు సుజిత్(Sujeeth)ఎంతో దూరదృష్టితో అలోచించి పవన్ కారుకి ఆ నెంబర్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా మొత్తం పవన్ అదే కారుని ఉపయోగిస్తాడనే ప్రచారం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వేదికపైనే ట్రైలర్ రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. థమన్ మ్యూజిక్ ని అందించాడు.
.webp)
![]() |
![]() |