![]() |
![]() |

'ఎన్టీఆర్: కథానాయకుడు', 'ఎన్టీఆర్: మహానాయకుడు' అంటూ నందమూరి తారక రామారావు జీవిత కథ రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ 2019లో విడుదలైంది. నటుడిగా బాలకృష్ణకు, దర్శకుడిగా క్రిష్ కి ప్రశంసలు దక్కినప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం ఈ చిత్రం పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Krish Jagarlamudi)
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'ఘాటి' (Ghaati) చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో క్రిష్ 'ఎన్టీఆర్ బయోపిక్' రిజల్ట్ పై స్పందించారు. "ఎన్టీఆర్ బయోపిక్ నా బెస్ట్ వర్క్స్ లో ఒకటి. కానీ, ఎందుకనో ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. సరైన సమయంలో విడుదల కాలేదేమో అనిపిస్తుంది. 2024 ఎన్నికల సమయంలో ఇది విడుదలై ఉంటే.. వందల కోట్లు కలెక్ట్ చేసేదని మా నాన్నగారు అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో నాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ ఎందరో ప్రముఖులు ఓటీటీలో సినిమా చూసి నాకు ఫోన్ చేసి అభినందిస్తుంటారు." అని క్రిష్ చెప్పుకొచ్చారు.
సినిమాని అద్భుతంగా రూపొందించడమే కాదు, సరైన సమయంలో విడుదల చేసుకోగలగాలి అంటుంటారు. 'ఎన్టీఆర్ బయోపిక్'ని కూడా సరైన సమయంలో విడుదల చేసుంటే.. రిజల్ట్ మరోలా ఉండేదనే అభిప్రాయంలో క్రిష్ ఉన్నారని.. ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
![]() |
![]() |