![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)పుట్టినరోజు వేడుకల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులతో పాటు దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 2 1971 వ సంవత్సరంలో పుట్టిన 'పవన్' ఈ పుట్టిన రోజుతో 55 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పవన్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు.
రీసెంట్ గా 'చిరంజీవి'(Chiranjeevi)ఎక్స్(X)వేదికగా స్పందిస్తు 'చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ట్వీట్ చేసాడు. ఈ సందర్భంగా పవన్ తో దిగిన ఓల్డ్ పిక్ ని షేర్ చెయ్యగా, అభిమానులని ఆకట్టుకుంటుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun),పవన్ మేనల్లుడు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్,స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత నటుడు బండ్ల గణేష్ తో పాటు పలువురు సినీ రాజకీయ, వ్యాపార ప్రముఖులు పవన్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.
![]() |
![]() |