![]() |
![]() |

సినిమాల పరంగా చూసుకుంటే విక్టరీ వెంకటేష్(Venkatesh)తన అప్ కమింగ్ మూవీని 'త్రివిక్రమ్'(Trivikram)దర్శకత్వంలో చేస్తున్నాడు. వెంకటేష్ కెరీర్ లో 'నువ్వు నాకు నచ్చావు. మల్లేశ్వరి' మంచి హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలకి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించాడు. దీంతో ఈ కాంబో సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మాయా జాలాన్ని ప్రదర్శిస్తుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉండగా, త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.
రీసెంట్ గా వెంకటేష్ పెంపుడు శునకం గూగుల్(Google)చనిపోయింది. ఈ విషయంపై వెంకటేష్ ఇన్ స్టాగ్రామ్(Instagram)వేదికగా స్పందిస్తు 'నా నమ్మకమైన, ప్రియమైన గూగుల్. గత 12 ఏళ్లుగా మా జీవితాల్లో భాగమయ్యావు. ఎంతో ప్రేమని పంచావు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు కూడా ఇచ్చావు. నువ్వే మా సన్షైన్. ఇక నీకు వీడ్కోలు. నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను డియర్ ఫ్రెండ్ అంటూ వెంకటేష్ గూగుల్ తో తాను దిగిన పిక్స్ తో నోట్ ని రాసుకొస్తు షేర్ చేసాడు.
ఇక త్రివిక్రమ్ తర్వాత 'వివి వినాయక్'(VV Vinayak)దర్శకత్వంలో వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో 'లక్ష్మి' వచ్చి వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే.

![]() |
![]() |