![]() |
![]() |

తెలుగు సినిమాపై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ప్రభావం చాలా ఎక్కువే. చిరంజీవి(Chiranjeevi)తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసి,తనకంటు ఒక బెంచ్ మార్కుని సృష్టించుకొని పవర్ స్టార్ గా ఎదిగారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ 'నారా చంద్రబాబు నాయుడు'(Nara Chandrababunaidu) మొదలుకొని, చిరంజీవితో పాటు పలువురు సినీ,రాజకీయ, వ్యాపార ప్రముఖులు పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.
రీసెంట్ గా ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)ఎక్స్(X)వేదికగా స్పందిస్తు 'మా పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలని ట్వీట్ చేసాడు. కొంత కాలం నుంచి మెగా, అల్లు కాంపౌండ్ మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ని ఉద్దేశించి అల్లు అర్జున్ 'మా' అని సంబోధించడంతో మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ నాయనమ్మ చనిపోయిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కి అధికార కార్యక్రమాలు ఉండటంతో వెళ్లలేకపోయాడు. నెక్స్ట్ డే వెళ్లి అల్లు అర్జున్, అరవింద్ గారిని పరామర్శించాడు. సినిమాల పరంగా చూసుకుంటే పవన్ అప్ కమింగ్ మూవీ 'ఓజి' సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
![]() |
![]() |