![]() |
![]() |

సప్తసాగరాలు దాటి సైడ్ ఏ, సైడ్ బి చిత్రాలతో దక్షిణ భారతీయ సినీ ప్రేక్షకులని అలరించిన నటీ 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth).ఈ చిత్రాల్లో 'ప్రియ' అనే క్యారక్టర్ లో 'రుక్మిణి' నటించిన తీరు తెలుగు ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ విజయం ఇచ్చిన గుర్తింపుతోనే, ఇప్పుడు పలు భారీ చిత్రాల్లో రుక్మిణి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఎన్టీఆర్(Ntr),ప్రశాంత్ నీల్(Prashanth Neel)మూవీలో 'రుక్మిణి' నే హీరోయిన్ అనే టాక్ చాలా బలంగా ఉంది. ఇక ఈ నెల 5 న తన కొత్త చిత్రం 'మదరాసి' తో ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
మదరాసి(Madharaasi)ప్రమోషన్స్ లో భాగంగా రుక్మిణి వసంత్ పలు ఇంటర్వూస్ లో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'సప్త సాగరాలు దాటి సినిమా గురించి మాట్లాడకుండా మరో చిత్రానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకునే స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఎప్పటికి చేరుకోలేనని కూడా అనుకుంటున్నాను. చిత్రసీమలో ఆ మూవీ రెండో జీవితాన్ని ఇచ్చింది. సప్తసాగరాలు ధాటి రాకముందు, ఇండస్ట్రీని వదిలి మరో ఉద్యోగం చేసుకోవాల్సివస్తుందా అని అనుకునే దానిని అని రుక్మిణి చెప్పుకొచ్చింది.
బెంగుళూరు కి చెందిన 'రుక్మిణి వసంత్' 2019 లో 'బీర్బల్ త్రయం కేస్ 1 'అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. దాంతో అదే ఏడాది హిందీలో 'అప్ స్టార్స్' అనే సినిమాలో చిన్న రోల్ లో చేసింది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకి సప్తసాగరాలు దాటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1), 'యష్'(yash)వన్ మాన్ షో 'టాక్సిక్'(Toxic)చిత్రాలు రుక్మిణి వసంత్ చేతిలో ఉన్నాయి.

![]() |
![]() |