![]() |
![]() |

గత పద్దెనిమిది రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలు శాఖల కార్మికులు తమ వేతనాలని పెంచాలని సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సెట్స్ పై ఉన్న పలు చిత్రాల షూటింగ్ లు ఆగిపోయాయి. ఈ విషయంలో కార్మికుల ఆధ్వర్యంలోని సినీ ఫెడరేషన్, నిర్మాత మండలి మధ్య జరుగుతున్న చర్చలు విఫలమవుతు వస్తున్నాయి. చిరంజీవి(Chiranjeevi),బాలకృష్ణ(Balakrishna) కూడా ఈ విషయంపై ఇరువైపుల యూనియన్స్ తో మాట్లాడుతున్నారు.
ఇక ఫెడరేషన్, నిర్మాతల మధ్య ఉన్న సమస్యకి త్వరగా పరిష్కారం చూపాలని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ప్రత్యేక చొరవ చూపారు. దీంతో రీసెంట్ గా మరోసారి చర్చలు జరుగగా విజయవంతమవ్వడంతో, ఈ రోజు నుంచి షూటింగ్స్ యధావిధిగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Dil Raju)సిఎం కి కృతజ్ఞత లు తెలిపారు.
ఫెడరేషన్ మొదటి నుంచి అడుగుతున్న 30 % శాలరీ పెంపులో, మొదటి ఏడాది 15 శాతం,రెండో ఏడాది 2.5 శాతం,మూడో ఏడాది 5 శాతం చొప్పున మొత్తం 22.5 శాతం వేతనాలు పెరగనున్నాయి. ఫెడరేషన్ అడిగిన మరికొన్ని సమస్యలకి కూడా సానుకూల స్పందన రావడం జరిగింది. ఇక చిత్ర పరిశ్రమలో మళ్ళీ షూటింగ్ ల హడావిడితో పండుగ వాతావరణం ఏర్పడినట్టే.
![]() |
![]() |