![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. భారీ అంచనాల నడుమ ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి రోజు డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టిందని అంచనా.
ఎన్టీఆర్ నటించడంతో 'వార్-2' తెలుగు వెర్షన్ కలెక్షన్స్.. హిందీ వెర్షన్ కి ధీటుగా ఉంటాయని అందరూ భావించారు. కానీ, మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే.. ఆ పరిస్థితి కనిపించడంలేదు. హిందీతో పోలిస్తే తెలుగు వెర్షన్ కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి. అయితే దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది. అలాగే, హైదరాబాద్ వంటి సిటీలలో ఎక్కువగా హిందీ మాట్లాడుతుంటారు. హిందీ వచ్చినవారు డబ్బింగ్ వెర్షన్ కంటే.. ఒరిజినల్ వెర్షన్ చూడటానికే ఆసక్తి చూపుతారు. ఈ కారణాలతోనే 'వార్-2' తెలుగు వెర్షన్ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![]() |
![]() |