![]() |
![]() |

సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)మరోసారి 'కూలీ'(Coolie)లో తన వన్ మాన్ షో ని ప్రదర్శించాడు. దీంతో కూలీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తొలిరోజు వరల్డ్ వైడ్ గా 151 కోట్ల గ్రాస్ ని సాధించి, ఎంటైర్ తమిళ చిత్రసీమలోనే, ఆ ఘనత అందుకున్న ఫస్ట్ మూవీగా నిలిచింది. రజనీ తన నట జీవితాన్ని ప్రారంభించి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, రికార్డుని నెలకొల్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
రీసెంట్ గా ఈ విషయంపై పవన్ కళ్యాణ్(Pawan Kalyan)స్పందిస్తు సిల్వర్ స్క్రీన్ పై 'సూపర్ స్టార్ రజనీ' అని టైటిల్ పడగానే, థియేటర్ ఏ విధంగా మారుమోగుతుందో చాలా సార్లు చెన్నైలో చూశాను. తరాలు మారుతున్నా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆ ఆనందోత్సాహాలు ఏ మాత్రం తగ్గలేదు. అంతటి స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి హీరో రజనీకాంత్ గారు. నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా తనదైన స్టైల్ ని చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. నడకలో, డైలాగ్స్ పలకడంలో, ప్రత్యేకతని చూపిస్తారు. ఆ స్టైల్ కి నవతరం ప్రేక్షకుల్లోను అభిమానులున్నారు.
మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలపై, యోగ సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలని తెలియచేస్తుంది. నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజనీకాంత్ గారు మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులని మెప్పించాలి. అందుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, పవన్ ఒక టాప్ హీరో అయినా రజనీ స్టైల్ గురించి ఒక అభిమానిలా చెప్పాడని పలువురు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi),ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)తో పాటు, పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఇండస్ట్రీలో రజనీ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందలు తెలియచేసారు.

![]() |
![]() |