![]() |
![]() |

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)నటనకి, డాన్స్ కి ఉన్న శక్తీ ఏంటో అందరకి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై ఆ రెండిటిని చాలా ఈజీగా ప్రదర్శించడంలో ఎన్టీఆర్ మంచి దిట్ట. అందుకే లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. అభిమానులంతా ఎన్టీఆర్ మ్యాజిక్ ని మరోసారి చూడటానికి ఆగస్టు 14 న విడుదల కాబోతున్న 'వార్ 2 '(War 2)కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో 'హృతిక్ రోషన్'(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ లో చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు కూడా ఉన్నాయి.
రీసెంట్ గా ముంబై వేదికగా జరిగిన వార్ 2 ప్రమోషన్స్ లో 'హృతిక్ రోషన్' మాట్లాడుతు 'నేను ఎంతో మంది కో స్టార్స్ తో వర్క్ చేసాను, కానీ ఎన్టీఆర్ లాంటి కో స్టార్ ని ఇంతవరకు చూడలేదు. డాన్స్ లోగాని, యాక్టింగ్ లో గాని ఎలాంటి రిహార్సల్స్ లేకుండా డైరెక్ట్ గా సెట్ కి వచ్చి చేసేస్తారు. ఈ విషయంలో ఎన్టీఆర్ నుంచి నేను చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. హృతిక్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి .ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే హృతిక్ మాటలపై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'వార్ 2 'లో ఎన్టీఆర్ 'రా ఏజెంట్'గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో ఎన్టీఆర్ బాలీవుడ్ పై తనదైన ముద్ర వేయబోతున్నాడని స్పషంగా అర్ధమవుతుంది. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ భారీ ఎత్తున విడుదల చేయబోతుండగా, త్వరలోనే తెలుగుకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది. కియారా అద్వానీ(Kiara Advani)హీరోయిన్ కాగా అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)దర్శకత్వం వహించాడు. 2019 లో హృతిక్, టైగర్ ష్రఫ్ కలిసి నటించిన వార్ కి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కింది. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films)భారీ వ్యయంతో నిర్మించింది.

![]() |
![]() |