![]() |
![]() |

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన 'మా భూమి'(Maa bhoomi)1979 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ప్రజా,సినీ కవి 'గద్దర్(Gaddar)రాసిన 'బండెన్క బండిగట్టి, పదహరు బండ్లు గట్టి' అనే పాట ఎంతగా సంచలనం సృషించిందో తెలిసిందే. కవిగానే కాకుండా ఈ సాంగ్ లో నటించడం ద్వారా తెలుగు చిత్ర సీమకి ఎంట్రీ ఇచ్చి 'రంగుల కల, ఒరేయ్ రిక్షా, జై భోలో తెలంగాణ వంటి పలు చిత్రాల్లో చిరకాలం నిలిచిపోయే పాటలు రాసాడు. తెలంగాణ రాష్ట్ర సాకారంలో భాగంగా జరిగిన ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తు, ఎన్నో ప్రజా గీతాలు రాసి తెలంగాణ ప్రజలు నిత్యం పాడుకునే సమర శoఖాల్లాంటి గీతాలని అందించాడు.
ఈ రోజు తెలంగాణ(Telangana)ఆవిర్బాదినోత్సవ వేడుకలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గద్దర్ కి రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించగా, గద్దర్ తరుపున ఆయన భార్య కోటిరూపాయలని అందుకోవడం జరిగింది. తెలంగాణకే చెందిన సినీగేయరచయితలైన సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, అందెశ్రీ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ పలు గీతాలని రాసారు. దీంతో వారికి కూడా చెరొక కోటిరూపాయలు ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం సినీ రంగానికి సంబంధించి గద్దర్ అవార్డులని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు రిలీజైన సినిమాలకి రీసెంట్ గా గద్దర్ అవార్డుని ప్రతి క్యాటగిరిలోను ప్రకటించారు. జూన్ 14 న ఆ అవార్డులని ఇవ్వనుంది.

![]() |
![]() |