![]() |
![]() |

పర్సంటేజ్ విషయంలో న్యాయం జరగడం లేదనే కారణంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగల్ స్క్రీన్ థియేటర్స్ ని జూన్ 1 నుంచి మూసివేస్తామని థియేటర్ ఓనర్స్ చెప్పిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara veeramallu)ని అడ్డుకోవడం కోసమే బంద్ అంశం తెరపైకి వచ్చిందనే అనుమానాల్ని పవన్ సన్నిహిత వర్గాలు వ్యక్తం చేసాయి. ఈ అంశంపై రీసెంట్ గా ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి(R Narayana murthy)మాట్లాడుతు 'హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సంటేజ్ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుంది. హరిహర వీరమల్లు ప్రస్తావన లేకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ కల్యాణ్ పై గౌరవం మరింత పెరిగేదని చెప్పుకొచ్చాడు.
ఆర్ నారాయణమూర్తి మాట్లాడిన ఈ మాటలపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టికుమార్ స్పందిస్తు 'పవన్ కళ్యాణ్ చాలా గౌరవంగా సినీపెద్దలందరు థియేటర్ల అంశంపై ముఖ్యమంత్రి గారిని కలిసి తమ సమస్యలని చెప్పుకోమని చెప్పారు. థియేటర్ లోపల తిను బండారాలు, కూల్ డ్రింక్స్ ఎక్కువ ధరకి అమ్ముతుంటే సామాన్య ప్రజల కోసమే వాటి మీద ఎంక్వయిరీ కమిషన్ వేస్తామని చెప్పాడు. ఆయన మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు. పరిశ్రమ మంచి కోసమే అదంతా చేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తు మాట్లాడాల్సిన అవసరం ఏముంది. థియేటర్లు ఎందుకు బంద్ చేస్తున్నారో మీకు తెలుసా. ఒక వేళ తెలిస్తే మీరు ఆన్సర్ చెప్తారా. మీతో మీటింగ్ పెట్టించిన వారు, మీతో మాట్లాడించిన వారు ఎవరో మాకు తెలుసు. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉన్నారు కదా. చిరంజీవి,ఇతర సినీ పెద్దలను అవమానించడం తప్పు అని ఎందుకు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఐదు రూపాయలు, ముప్పై రూపాయిలు టికెట్ పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. గాంధీ గారి టికెట్ ఉంటుందని మీరు, పోసాని చెప్పి ఎందుకు చెయ్యలేదు. కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తిని అంటారు కదా!. థియేటర్ లో పాప్ కార్న్ 300 ,కూల్ డ్రింక్ 500 అమ్మినప్పుడు ఎందుకు ఖండించలేదని నట్టికుమార్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |