![]() |
![]() |

యూనివర్సల్ స్టార్ 'కమల్ హాసన్'(Kamal Haasan)ఈ నెల 5 న 'థగ్ లైఫ్'(Thug Life)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ఆడియో ఫంక్షన్ చెన్నై వేదికగా జరిగింది. అందులో ఆయన మాట్లాడుతు 'తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందనే వ్యాఖ్యలు చేసాడు. దీంతో కన్నడ నాట నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ భాషా సంఘాలైతే కన్నడ ప్రజలకి కమల్ క్షమాపణలు చెప్పకపోతే 'థగ్ లైఫ్' రిలీజ్ ని అడ్డుకుంటామని ప్రకటించాయి. కమల్ మాత్రం ప్రేమతో మాట్లాడిన మాటలకి క్షమాపణలు ఉండవని చెప్పాడు. దీంతో కన్నడ నాట 'థగ్ లైఫ్' రిలీజ్ పై టెన్షన్ నెలకొని ఉంది.
ఈ క్రమంలో 'థగ్ లైఫ్' రిలీజ్ కోసం కమల్ కర్ణాటక(Karnataka)హైకోర్ట్ ని ఆశ్రయించాడు. తన సొంత సంస్థ 'రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్' ద్వారా వేసిన ఆ పిటిషన్ లో 'థగ్ లైఫ్' విడుదలకి ఆటంకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ,చలన చిత్ర వాణిజ్య విభాగాలకి ఆదేశాలు జారీచేయాలి. స్క్రీనింగ్ కి తగిన భద్రత కలిపించేలా కూడా డిజీపీ, సిటీ పోలీస్ కమిషనర్ కి సూచనలు జారీ చెయ్యాలని సదరు పిటిషన్ లో పేర్కొన్నాడు.
లెజండ్రీ డైరెక్టర్ 'మణిరత్నం'(Mani Rathnam)తెరకెక్కించిన 'థగ్ లైఫ్' లో త్రిష, శింబు, ఐశ్వర్య లేక్ష్మి, అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, జాజు జార్జ్ కీలక పాత్రలు పోషించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా 'థగ్ లైఫ్' తెరకెక్కింది.
![]() |
![]() |