![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే విచారణకు సరిగ్గా ఒకరోజు ముందు, తాను రాలేనంటూ మహేష్ బాబు లేఖ రాశాడు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరు కాలేనని, మరో డేట్ ఇవ్వాలని ఈడీని కోరాడు. (Mahesh Babu)
సురానా గ్రూప్ కి చెందిన సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ డెవలపర్స్ కంపెనీలు.. ఫ్లాట్లు నిర్మించి ఇస్తామంటూ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశాయంటూ పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈడీ.. ఆ కంపెనీల్లో సోదాలు చేసింది. ఈ క్రమంలోనే ఆ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబుకి కూడా నోటీసులు ఇచ్చింది. ప్రమోషన్స్ కోసం 5.9 కోట్ల రూపాయలను మహేష్ తీసుకున్నట్లు గుర్తించిన ఈడీ.. ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ మాత్రం షూటింగ్ కారణంగా రాలేకపోతున్నానని లేఖ రాశాడు. మరి దీనిపై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |