![]() |
![]() |

ఆ మధ్య టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. కొంతకాలంగా మలయాళ ఇండస్ట్రీ ప్రముఖులు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దర్శకుల వంతు వచ్చింది.
మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ప్రముఖ దర్శకులు అరెస్ట్ అయ్యారు. ఆ దర్శకులు ఎవరో కాదు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజా. వారి స్నేహితుడు షలీఫ్ తో కలిసి మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారన్న సమాచారంతో.. అపార్ట్ మెంట్ కి వెళ్ళి సోదాలు నిర్వహించిన పోలీసులు, వారిని అరెస్ట్ చేశారు. సినిమా చర్చల కోసం ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వారు.. కొంతకాలంగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'జింఖానా' చిత్రానికి ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించాడు. గతంలో 'తల్లుమాల', 'ఉండ' వంటి సినిమాలతో పేరు పొందాడు. ఇక అష్రఫ్ హంజా కూడా థమాషా, భీమంటే వాజి సులైఖా మంజిల్ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు పొందాడు.
![]() |
![]() |