![]() |
![]() |

శర్వానంద్(Sharwanand)రచ్చ మూవీ ఫేమ్ 'సంపత్ నంది'(Sampath nandi)కాంబినేషన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో కూడిన చిత్రం ఒకటి తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. 1960 వ కాలం నాటి నేపథ్యంలో తెలంగాణ(Telangana)మహారాష్ట్ర(Maharashtra)బోర్డర్ లో జరిగే కథగా తెలుస్తుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా హైదరాబాద్ సమీపంలో సుమారు పదిహేను ఎకరాల్లో భారీ సెట్ ని వేశారు. మూవీకి సంబంధించిన షూటింగ్ ఎక్కువ భాగం అక్కడే జరగనున్నట్టుగా తెలుస్తుంది.
'శర్వానంద్' కి జోడిగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)కనపడనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించడంతో మూవీకి మరింత క్రేజ్ వచ్చినట్లయింది. ఇంతకు ముందు ఈ జంట 2017 లో వచ్చిన 'శతమానంభవతి' లో కలిసి చేశారు. ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత ఈ జంట సంపత్ నంది(Sampath Nandi)సినిమా ద్వారా ప్రేక్షకులని మరోసారి కనువిందు చేయనుంది. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.
గతంలో సంపత్ నంది, సత్య సాయి ఆర్ట్స్ కాంబోలో ఏమైంది ఈ వేళ, బెంగాల్ టైగర్ లాంటి చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. సత్యసాయి ఆర్ట్స్ గత ఏడాది గోపీచంద్ తో 'భీమా' తెరకెక్కించింది.
![]() |
![]() |