![]() |
![]() |

శ్రీలీల(Sreeleela)ప్రస్తుతం స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)తో కలిసి బాలీవుడ్ లో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ,ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఈ మూవీ చిత్రీకరణ సమయంలో శ్రీలీల,కార్తీక్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంపై ఆ ఇద్దరు ఎక్కడా స్పందించలేదు.
కానీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతు నాకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.తన రెమ్యునరేషన్ కి సంబంధించిన విషయంపై ఆయన మాట్లాడుతు నేను 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడంపై కొంత మంది రాద్ధాంతం చేస్తున్నారు.నేను ఒక్కడినే 50 కోట్లు తీసుకోవడం లేదు కదా!చాలా మంది తీసుకుంటున్నారు.కానీ వారి గురించి ఎవరు మాట్లాడరు.నా గురించి మాత్రమే మాట్లాడతారు.ఎందుకంటే ఇక్కడ నన్ను సపోర్ట్ చెయ్యడానికి ఎవరు లేరు.
సోదరులు,స్నేహితులు,గర్ల్ ఫ్రెండ్ ఇలా నాకు సంబంధించిన వారెవరు ఇండస్ట్రీలో లేరు.అందుకే వాళ్లకి నేను మాత్రమే కనిపిస్తాను.ఇష్టం లేని వ్యక్తుల గురించి రూమర్స్ సృష్టించడానికి బాలీవుడ్ లో కొంత మంది సిద్ధంగా ఉంటారని చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |