![]() |
![]() |

దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నాని (Nani).. ఫుల్ జోష్ లో ఉన్నాడు. నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్-3'తో పాటు, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో 'ది ప్యారడైజ్' చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాల ఓటీటీ డీల్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో రూపొందే హిట్ ఫ్రాంచైజ్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే వచ్చిన హిట్-1, హిట్-2 విజయం సాధించాయి. మే 1 న విడుదల కానున్న హిట్-3 లో నాని హీరో కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ.55 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. (HIT 3)
దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న మూవీ ప్యారడైజ్. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ రిలీజ్ కి ఏడాది ముందే.. ఏకంగా రూ.65 కోట్లకు ప్యారడైజ్ ఓటీటీ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. (The Paradise)
ఇటీవల కాలంలో.. విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాల ఓటీటీ డీల్స్ క్లోజ్ అవట్లేదు. అలాంటిది ఎప్పుడో ఏడాది తర్వాత వచ్చే సినిమా.. భారీ ఓటీటీ డీల్ కుదుర్చుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
నానికి మినిమం గ్యారెంటీ హీరోగా పేరుంది. నాని సినిమా అంటే.. మంచి కంటెంట్ ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. అందుకే నాని నటించిన మెజారిటీ సినిమాలు హిట్ అవుతున్నాయి. ఓటీటీలోనూ నాని సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే అదిరిపోయే ఓటీటీ ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్.. నాని సినిమా అంటే చాలు.. వెంటనే కర్చీఫ్ వేసేస్తోంది.
![]() |
![]() |