![]() |
![]() |

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెహమాన్ కి ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని మొదట వార్తలొచ్చాయి. దీంతో అభిమానులు కొంత ఆందోళన చెందారు. అయితే రెహమాన్ ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అన్నట్టుగానే రెహమాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతేకాదు, రెహమాన్ హెల్త్ బులెటిన్ కూడా విడుదలైంది. ఆయన డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. రెహమాన్ స్వల్ప అస్వస్థతకే గురయ్యారని, డిశ్చార్జ్ కూడా అయ్యారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
![]() |
![]() |