![]() |
![]() |
.webp)
చిరంజీవి హిట్ సినిమాల్లో 1997 లో వచ్చిన మాస్టర్ మూవీ కూడా ఒకటి.ఈ మూవీ ద్వారా నటుడుగా గుర్తింపు పొందిన శివాజీ, ఆ తర్వాత హీరోగా మారి తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడుగా మారాడు.ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులని మెప్పించేలా చెయ్యడం శివాజీ నటనకి ఉన్న స్టైల్.కామెడీ నటుడుగాను విజృంభించి నటించగలడు.గత సంవత్సరం 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు.ఈ నెల 14 న విదుదలైన 'కోర్ట్'అనే మూవీలో కూడా మంగపతి అనే క్యారక్టర్ ని పోషించి,మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు.ప్రేక్షకులు కూడా మంగపతి క్యారక్టర్ కి ఎంతగానో కనెక్ట్ అవుతున్నారు
రీసెంట్ గా శివాజీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నా భార్య పిల్లలు అడగడంతో సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను.కాకపోతే అవకాశాలు ఇవ్వమని ఎవర్ని అడిగేవాడ్ని కాదు.సొంత ప్రాజక్ట్ నిర్మించాలనే లక్ష్యంతో ఈటీవీ యాజమాన్యాన్ని కలిస్తే 90's వెబ్ సిరీస్ అవకాశం వచ్చింది.అది హిట్ అవ్వడంతో సుమారు 80 కథలు నా దగ్గరకి వచ్చాయి.కానీ వాటిల్లో ఎక్కువగా తండ్రి క్యారక్టర్లే కావడంతో చాలా వరకు రిజెక్ట్ చేశాను.
కానీ కోర్ట్ లోని మంగపతి క్యారక్టర్ తో నా ఇరవై ఐదేళ్ల కల నెరవేరడంతో పాటుగా,హీరో నాని ద్వారా ఆ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.మంగపతి క్యారక్టర్ పూర్తిగా నా కోసమే పుట్టగా అందులోని సహజమైన ఎమోషన్ అందరకి నచ్చుతుంది.ప్రతి కుటుంబంలోను మంగపతి లాంటి వాళ్ళు కనపడుతుంటారు.షూటింగ్ టైంలో మంగపతిగా నా అరుపులకి సెట్ లో వాళ్ళు చాలా సార్లు భయపడ్డారు.క్రూరమైన క్యారక్టర్ లతో ప్రేక్షకులని ఆశ్చర్య పరచాలనే కోరిక చాలా బలంగా ఉందని కూడా చెప్పుకొచ్చాడు.
.webp)
![]() |
![]() |