![]() |
![]() |

తెలుగు సినిమా ప్రేమికులకి పరిచయం అక్కర్లేని నటి సురేఖవాణి(Surekha Vani)సుదీర్ఘ కాలం నుంచి తనదైన శైలిలో నటిస్తు ప్రేక్షకులని అలరిస్తు వస్తుంది.ఆమె కుమార్తె సుప్రీత(Supritha)కూడా తన తల్లి అడుగుజాడల్లోనే నడుస్తు నటిగా ప్రూవ్ చేసుకునే పనిలో ఉంది.సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్ గా కూడా రాణిస్తు ఎంతో మంది ఫాలోవర్స్ ని కూడా సంపాదించింది.
రీసెంట్ గా హోలీ రోజు సుప్రీత ఒక వీడియో రిలీజ్ చేసింది.అందులో ఆమె మాట్లాడుతు ఎవరు కూడా ఈజీ మనీకి అలవాటు పడకండి. కొంత మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్స్ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని.ఆ విధంగా ప్రమోట్ చేసినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు అలాంటివి మానేసాను.ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే వాటిని చూసి ఎంకరేజ్ చెయ్యకుండా,అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేయ్యండి.అసలు అలాంటి వ్యక్తులని సోషల్ మీడియాలో ఫాలో కూడా అవ్వద్దని చెప్పుకొచ్చింది.
.webp)
![]() |
![]() |