![]() |
![]() |
.webp)
నటప్రపూర్ణ,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(MOhan Babu)కి తెలుగు ప్రేక్షకులతో ఉన్న అనుబంధం విడదీయరానిది.ఐదు దశాబ్డల నుంచి విలక్షణమైన నటనతో, తనకి మాత్రమే సాధ్యమైన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు.హీరోతో పాటు తెలుగు తెరపై మిగతా ఎన్నిరకాల పాత్రలు ఉంటాయో,వాటన్నింటిని అవలీలగా పోషించి తనకంటు ఒక బెంచ్ మార్క్ ని సృష్టించుకోవడమే కాకుండా,నిర్మాతగాను ఎన్నో హిట్ సినిమాలని అందించి హిట్ ప్రొడ్యూసర్ గా కూడా ఖ్యాతి గడించారు.ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ 'కన్నప్ప'(Kannappa)తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నాడు.పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 25 న 'కన్నప్ప' ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, టైటిల్ రోల్ లో తన మొదటి నట వారసుడు మంచు విష్ణు చేస్తుండంతో పాటు ప్రభాస్,మోహన్ లాల్,అక్షయ్ కుమార్,శరత్ కుమార్,కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ చేస్తుండంతో కన్నప్ప కోసం మంచు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
రీసెంట్ గా మోహన్ బాబు, మంచు విష్ణు(Manchu Vishnu)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy)ని కలవడం జరిగింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన విష్ణు రేవంత్ రెడ్డిని శాలువ కప్పిన ఫోటోలు కూడా షేర్ చేసాడు.సిఎం రేవంత్ రెడ్డి గారితో కొన్ని ఇంపార్టెంట్ విషయాలపై చర్చించామని,తెలుగు సినీ పరిశ్రమ మరింత ఎదగడానికి సహకరిస్తానని కూడా సిఎం హామీ ఇచ్చారని విష్ణు తెలియచేసాడు.విష్ణు ప్రస్తుతం మా మూవీ ఆరిస్ట్ చైర్మన్ గా ఉన్న విషయం తెలిసిందే
రీసెంట్ గా మోహన్ బాబు పై ఖమ్మం కి చెందిన ఒక వ్యక్తి సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణమని కొన్ని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి ఈ టైం లో రేవంత్ రెడ్డి ని మోహన్ బాబు, విష్ణు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆరోపణలు చేసిన ఖమ్మం వ్యక్తి కి మతిస్థిమితం అంతగా బాగోలేదనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
.webp)
![]() |
![]() |