![]() |
![]() |

'పెళ్లి చూపులు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు ప్రియదర్శి(Priyadarshi).హీరోగా కూడా మల్లేశం,బలగం వంటి చిత్రాలతో తనేంటో నిరూపించుకున్నాడు. గత చిత్రం 'డార్లింగ్' తో పరాజయాన్ని అందుకున్న ప్రియదర్శి ఈ నెల 14 న 'కోర్ట్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.నాచురల్ స్టార్ నాని(Nani)ఈ మూవీకి నిర్మాత కావడంతో కోర్ట్ పై అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది.
ప్రియదర్శి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కోర్ట్ మూవీకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.ప్రియదర్శి మాట్లాడుతు కోర్ట్ మూవీలో 'సూర్యతేజ' అనే లాయర్ క్యారక్టర్ పోషించాను.ఈ క్యారక్టర్ కోసం ఎంతో రీసెర్చ్ చేశా. న్యాయవాదులు కోర్టు టైంలో ఎలా ఉంటారు.వాళ్ళ బాడీలాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది.న్యాయమూర్తులతో ఏ విధంగా మాట్లాడతారు అనే విషయాలని కోర్టులకి వెళ్లి గమించాను.స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సస్ రాధాకృష్ణ మా కోర్టు కథకి స్ఫూర్తి.'ఫోక్సో' చట్టం అంటే ఏమిటి దానిని ఏ విషయంలో అమలు చేస్తారు.
ఒక అమాయక కుర్రాడు ఫోక్సో కేసులో ఇరుక్కుంటే న్యాయవ్యవస్థ తనని ఎలా కాపాడిందనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.ఇందులో నేను హీరోని అని అనుకోవడం లేదు.ప్రతి క్యారక్టర్ కూడా హీరోనే.ఏ ఒక్క క్యారక్టర్ లేకపోయినా సినిమా వర్క్ అవుట్ అవ్వదని చెప్పుకొచ్చాడు.సాయికుమార్,శుభలేఖ సుధాకర్,శివాజీ,శ్రీదేవి,రోహిణి, హర్షవర్ధన్,హర్ష రోషన్, రాజశేఖర్ అనింగి,సురభి ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా నూతన దర్శకుడు రామ్ జగదీష్(Ram jagadeesh)ఎంతో రీసెర్చ్ చేసి ఈ కోర్ట్ మూవీని తెరకెక్కించాడు.

![]() |
![]() |