![]() |
![]() |

స్టార్ కొరియోగ్రాఫర్ 'శేఖర్ మాస్టర్'(Sekhar master)గురించి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. రెండు దశాబ్డల నుంచి కొనసాగుతు వస్తున్న తన సినీజర్నీలో ఎన్నో పాటలకి అద్భుతమైన కోరియోగ్రాఫ్ ని అందిస్తు వస్తున్నాడు.జనతా గ్యారేజ్ లోని 'నేను పక్కా లోకల్', 'దివి నుంచి భువికొచ్చావా ఆపిల్ బ్యూటీ',బ్రూస్ లీ లోని 'కుంగ్ ఫూ కుమారి, ఫిదా నుంచి 'వచ్చిండే', సరైనోడు లో 'బ్లాక్ బస్టర్', ఖైదీ నెంబర్ 150 లోని 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు', దువ్వాడ జగన్నాధం 'సిటిమార్' సాంగ్, ఇస్మార్ట్ శంకర్ 'దిమాక్ ఖరాబ్, గుండె జారీ గల్లతయ్యింది నుంచి టైటిల్ సాంగ్, అల వైకుంఠ పురంలోని 'రాములో రాములా',ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలకి తనదయిన స్టైల్లో స్టెప్ లని అందించి నేటికీ ఆ స్టెప్ లని ప్రేక్షకులు ఫాలో అయ్యేలా చేస్తున్నాడు.
శేఖర్ మాస్టర్ రీసెంట్ గా నితిన్(Nithiin)హీరోగా వెంకీ కుడుముల(venki Kudumala)దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ లోని ఒక సాంగ్ కి కోరియోగ్రఫీని అందించడం జరిగింది.'అదిదా సర్‌ప్రైజు'(Adhi Dha Surprisu)అంటూ సాగిన ఆ సాంగ్ మూవీలో వచ్చే ఐటెం సాంగ్ అని అర్ధమవుతుంది.ప్రముఖ హీరోయిన్ కేతిక శర్మ పై ఆ సాంగ్ చిత్రీకరించడం జరిగింది.రీసెంట్ గా ఆ సాంగ్ కి సంబంధించిన ప్రోమో వీడియో రిలీజ్ అవ్వగా, అందులో కేతిక చేత శేఖర్ మాస్టర్ చేయించిన హుక్ స్టెప్ పై కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.శేఖర్ మాస్టర్ ఈమధ్య శ్రుతి మించుతున్నాడేంటి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కూడా చెయ్యడం మొదలుపెట్టారు.ఖైదీ నెంబర్ 150 లో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ లో కూడా సిగ్నేచర్ స్టెప్ ఉంది.చరణ్ చిరంజీవి లు కూడా కలిసి ఆ స్టెప్ వేస్తారు.కాకపోతే ఆ సిగ్నేచర్ స్టెప్ లో ఎలాంటి అసభ్యత లేకుండా ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసింది.నేటికీ చాలా మంది ఆ స్టెప్ ని వేస్తుంటారు.
కానీ రాబిన్ హుడ్ లో కేతిక శర్మ చేత చేయించిన స్టెప్ మాత్రం అంత ఆక్షేపణీయం కాదని, సోషల్ మీడియా యుగంలో అలాంటి స్టెప్స్ పిల్లలపై ప్రభావం చూపిస్తాయని సామాజిక విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.శేఖర్ మాస్టర్ ఇటీవల కంపోజ్ చేసిన మిస్టర్ బచ్చన్, డాకూ మహారాజ్‌లోని హుక్ స్టెప్పులుపై కూడా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

![]() |
![]() |