![]() |
![]() |

ఈ జనరేషన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ముందు వరుసలో ఉంటాడు. టాక్ తో సంబంధం లేకుండా, నాని సినిమాలను థియేటర్లలో చూడటానికి కుటుంబ ప్రేక్షకులు ఇష్టపడతారు. ఓవర్సీస్ లోనూ నాని సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకొన్నాడు. అలాంటి నాని, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమవుతున్నాడా అనే అనుమానం కలుగుతోంది.
2023 లో వచ్చిన 'దసరా' సినిమాలో నాని మొదటిసారి పూర్తిగా మాస్ అవతార్ లో కనిపించాడు. ఆ తర్వాత 'హాయ్ నాన్న' వంటి క్లాస్ సినిమాతో అలరించినప్పటికీ.. ప్రస్తుతం నాని మాస్ జపం చేస్తున్నాడు. వరుసగా భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. (Natural Star Nani)
నాని గతేడాది 'సరిపోదా శనివారం' అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్-3' అనే మరో యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. మే 1న విడుదల కానున్న ఈ సినిమాలో రూత్ లెస్ కాప్ గా నాని కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన 'హిట్-3' టీజర్ ఎంత వయలెంట్ గా ఉందో తెలిసిందే. ఫ్యామిలీ హీరోగా పేరున్న నాని, ఇంత వయలెంట్ గా మారిపోయాడని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక తాజాగా నాని, అంతకుమించిన సర్ ప్రైజ్ ఇచ్చాడు. (HIT 3)
'దసరా' తర్వాత నాని-దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న మూవీ 'ది ప్యారడైజ్'. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ విడుదలైంది. ఇది 'హిట్-3'కి బాప్ అన్నట్టుగా ఉంది. గ్లింప్స్ వయలెంట్ గా ఉండటమే కాకుండా, నాని మునుపెన్నడూ చూడని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. 'ప్యారడైజ్' గ్లింప్స్ చూసి ఇది నిజంగా నాని సినిమానేనా అని అందరూ అవాక్కవుతున్నారు. (The Paradise)
'హిట్-3', 'ప్యారడైజ్' తర్వాత సుజీత్ దర్శకత్వంలో నాని ఒక సినిమా కమిటై ఉన్నాడు. అది కూడా యాక్షన్ సినిమానే. ఇలా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ.. నాని ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమవుతున్నాడా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని తక్కువ అంచనా వేయకూడదు. ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అంటే, దానికి కారణం కుటుంబ ప్రేక్షకులు. అలాంటిది, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న నాని.. వరుస వయలెంట్ సినిమాలు చేస్తూ వారిని దూరం చేసుకుంటున్నాడా? అనే చర్చ జరుగుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
![]() |
![]() |