![]() |
![]() |
.webp)
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ లో 'ఠాగూర్'(Tagore)కూడా ఒకటి.ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానాన్ని పొందిన నటి జ్యోతిక(Jyothika).ప్రముఖ స్టార్ హీరో సూర్య(suriya)ని ప్రేమ వివాహం చేసుకున్నజ్యోతిక ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటు పలు హిందీ వెబ్ సిరీస్ లో చేస్తుంది.రీసెంట్ గా 'డబ్బాకార్టెల్' అనే వెబ్ సిరీస్ లో చెయ్యగా, ఫిబ్రవరి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆ సిరిస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో జ్యోతిక మాట్లాడుతు దక్షిణాదిసినీ పరిశ్రమలో,మహిళా ప్రాధాన్యత చిత్రాలని తెరకెక్కించే వాళ్ళు తగ్గిపోయారు.గతంలో బాలచందర్(Bala chander) గారి వంటి దర్శకులు,బడా నిర్మాతలు మహిళా చిత్రాలపై దృష్టి పెట్టే వాళ్ళు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.కేవలం హీరోల కోసమే సినిమా నిర్మిస్తున్నారు.అందుకు బడ్జట్ ఒక కారణం అయితే మహిళల వయసు కూడా మరొక కారణం.అందుకే ఏ స్టార్ హీరో సరసన నటించే అవకాశం రాలేదు.
28 ఏళ్ళ వయసులో ఇద్దరి పిల్లలకి తల్లినయ్యి ,భిన్నమైన క్యారెక్టర్స్ పోషిస్తు నటిగా కొనసాగుతున్నాను.దక్షిణాదిలో నటిగా కొనగడం చాలా కష్టం.ఎందుకంటే ఇక్కడ ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందని తెలిపింది.జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
![]() |
![]() |