![]() |
![]() |

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)నటప్రస్థానికి ఉన్న వైభవం సౌత్ సినీప్రేమికులకి తెలియనిది కాదు.ఏ క్యారక్టర్ లో అయినా అవలీలగా నటించి,ఆ క్యారక్టర్ తాలూకు ప్రయాణాన్ని ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలపగలిగే సత్తా మోహన్ లాల్ సొంతం.రీసెంట్ గా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)ఊబకాయ సమస్యని తొలగించి ఆరోగ్యవంతమైన ఇండియాని నిర్మించాలనే తలపుతో,ఊబకాయ సమస్యపై ప్రజలకి అవగాహనా కల్పించేందుకు 10 మంది ప్రముఖలతో కూడిన టీం ని ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఆ టీంలో మోహన్ లాల్ కూడా ఒకడు.
ఇప్పుడు మోహన్ లాల్ కూడా ఊబకాయ సమస్యని నివారించడానికి చిరంజీవి(Chiranjeevi)రజినీ కాంత్(Rajinikanth)మమ్ముట్టి,దుల్కర్ సల్మాన్, టోవినో థామస్,ఉన్ని ముకుందన్, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్,దర్శకులు ప్రియదర్శన్ ,రవి ఇలా పది మందిని నామినేట్ చేసాడు. ఈ పది మందితో కలిసి ఊబకాయ సమస్య ని ఎలా నివారించవచ్చో మోహన్ లాల్ ప్రజలకి తెలియచేయనున్నాడు.ఆరోగ్య గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు.సుమారు 250 కోట్ల మంది ఉబకాయసమస్యతో బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి,సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న ఫ్యాన్ బేస్ ఏ పాటిదో అందరకి తెలిసిందే.కొన్ని లక్షల మంది అభిమానులతో పాటు ప్రేక్షకుల బలం కూడా వాళ్ళ సొంతం. కాబట్టి ఊబకాయ సమస్యపై ఆ ఇద్దరు మోహన్ లాల్ తో చేతులు కలపడం వలన ఊబకాయ సమస్య కి నివారణ చర్యలు చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది.

![]() |
![]() |