![]() |
![]() |
.webp)
రణబీర్ కపూర్(Ranbir Kapoor)రాముడిగా,సాయిపల్లవి(Sai Pallavi)సీతగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ 'రామాయణ'(Ramayana)కన్నడ స్టార్ హీరో యష్(Yash)రావణాసురుడిగా చేస్తుండటంతో పాటు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాజెక్టు మరింత ఆసక్తిని కలగచేస్తుంది.కొన్ని నెలల క్రితం షూటింగ్ ప్రారంభం కాగా రణబీర్ కపూర్, సాయి పల్లవికి సంబంధించిన పిక్స్ బయటకి కూడా వచ్చాయి.కానీ ఇంతవరకు యష్ కి సంబంధించిన ఎలాంటి లుక్ బయటకి రాలేదు.పైగా యష్ కి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ ని కూడా చిత్ర బృందం వెల్లడి చెయ్యలేదు
కాకపోతే రీసెంట్ గా 'యష్' రామాయణ షూటింగ్ లో జాయిన్ అయ్యాడని,రెండు రోజుల డ్రెస్ రిహార్సల్స్ తర్వాత, ఫిబ్రవరి 21 న యష్ పై షూటింగ్ స్టార్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత షెడ్యూల్ లో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రికరిస్తున్నారని,ఈ షెడ్యూల్ ముగిశాక, 'దహిసర్ 'లోని ఒక స్టూడియోలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతుందనే మాటలు ముంబై సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.మరి చిత్ర బృందం ఈ విషయంపై అధికారకంగా ఏమైనా ప్రకటన చేస్తుందో లేదో చూడాలి.
రెండు భాగాలుగా రామాయణ తెరకెక్కుతుండగా,మొదటి భాగం 2026 దీపావళికి,రెండవ భాగం 2027 దీపావళి కి విడుదల చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారు.అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.నితీష్ తివారి(NItesh Tiwari)దర్శకుడు కాగా అమితాబ్(Amitabh Bachchan)సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
.webp)
![]() |
![]() |