![]() |
![]() |

ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'ని పూర్తి చేసే పనిలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్ కావడంతో కేవలం ప్రకటనతోనే డ్రాగన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 20 నుంచి ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. మొదట ఎన్టీఆర్ లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. రెండో షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు. (NTR Neel)
'డ్రాగన్' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన ప్రశాంత్ నీల్.. అందుకు తగ్గట్టుగానే వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపుతున్నాడు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. టోవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు వినికిడి. ఇంకా పలువురు స్టార్ యాక్టర్స్ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఊర్వశీ రౌతేలా పేరు తెరపైకి వచ్చింది. (Dragon)
గ్లామర్ క్వీన్ గా పేరున్న ఊర్వశి, టాలీవుడ్ లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేసింది. బాలకృష్ణ రీసెంట్ ఫిల్మ్ 'డాకు మహారాజ్'లో మాత్రం కేవలం సాంగ్ కి పరిమితం కాకుండా, ఎస్ఐ జానకి పాత్రలో అలరించింది. ఈ సినిమా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. కేవలం స్పెషల్ సాంగ్స్ తో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకోవడం కాకుండా, మంచి నటిగా నిరూపించుకోవాలని ఊర్వశి ఆశ పడుతోంది. ఆ ఆశ డ్రాగన్ తో నెరవేరేలా కనిపిస్తోంది.
డ్రాగన్ సినిమాలో ఊర్వశి నటిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో పాత్రలను బలంగా రాసుకుంటాడు. నిడివితో సంబంధం లేకుండా.. ప్రతి పాత్రకి సినిమాలో ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటాడు. డ్రాగన్ లో ఊర్వశి పాత్రకు కూడా మంచి ప్రాముఖ్యత ఉంటుందట. మరి ఈ సినిమా తర్వాత, నటిగా ఊర్వశి ఫుల్ బిజీగా మారిపోతుందేమో చూడాలి.
![]() |
![]() |