![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ఆసుపత్రిలో చేరినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఆమె రెగ్యులర్ చెకప్ కోసం వెళ్ళారా లేక అనారోగ్యంతో చేరారా? అనేది తెలియాల్సి ఉంది.
చిరంజీవి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. మ్యారేజ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ కోసం భార్య సురేఖతో కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడి నుంచి అబుదాబిలో జరగనున్న ఒక వివాహ వేడుకకు హాజరు కానున్నారు. ఇలాంటి సమయంలో అంజనాదేవి ఆసుపత్రి పాలైనట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం విజయవాడ నుంచి హైద్రాబాద్ కి బయలుదేరినట్లు న్యూస్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో క్లారిటీ రావాల్సి ఉంది.
![]() |
![]() |